Search This Blog

Sunday, 27 November 2016

ఏబీఎన్‌ సర్వేపై గోనె ప్రకాశ్‌ ఘాటు స్పందన

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేపై ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌ రావు స్పందించారు. ఒక ఛానల్‌ చర్చలో ఫోన్ లైన్ ద్వారా పాల్గొన్న ఆయన… సర్వేపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో చిరంజీవిని కూడా సదరు మీడియా సంస్థ ఇలాగే ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత కిందపడేసిందని గుర్తు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో సర్వే చేసిన ఆంధ్రజ్యోతి ప్రజారాజ్యం అధికారంలోకి వస్తోందని చెప్పిందన్నారు. చిరంజీవితో విభేదాలు రాగానే ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ప్లాప్ అవుతోందని కూడా రాసిందని గుర్తు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే వాస్తవాలకు సర్వే దూరంగా ఉందన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చాలా కష్టమైన పరిస్థితే ఉంటుందన్నారు. ఈ విషయాన్ని కొందరు టీడీపీ సీనియర్‌ నేతలే తనతో స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం టీడీపీ నేతలే చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వే ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు.
మరోవైపు పవన్‌ కల్యాణ్‌కు నాలుగు శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయని ఆంధ్రజ్యోతి చెప్పడంపై జనసేన నాయకుడు కల్యాణ్ దిలీప్ చర్చాకార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. జగన్‌ మీద కోపంతో సర్వేలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదు గానీ… జనసేనకు మాత్రం నాలుగు శాతం కూడా ఓట్లు రావని చెప్పడం అభ్యంతరకరమన్నారు. ఇలాంటి మైండ్ గేమ్ ఆడడం మానుకోవాలని సూచించారు. ఒక కథనం పాజిటివ్‌గా మరొక కథనం నెగిటివ్‌గా సదరు మీడియా రాసే విధానం తమకు తెలుసన్నారు.

No comments :

Post a Comment